Share News

దట్టంగా మంచు.. ఎడతెరిపిలేని వర్షం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:07 AM

ఒకవైపు దట్టమైన మంచు... మరోవైపు ఎడతెరిపిలేని వర్షం... తిరుమల కొండను ఉక్కిరిబిక్కిరి చేశాయు. ఘాట్‌రోడ్లలో ముందు వెళుతున్న వాహనాలు,

దట్టంగా మంచు.. ఎడతెరిపిలేని వర్షం

తిరుమల కొండ జలమయం... ఇబ్బంది పడ్డ భక్తులు

తిరుమల, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఒకవైపు దట్టమైన మంచు... మరోవైపు ఎడతెరిపిలేని వర్షం... తిరుమల కొండను ఉక్కిరిబిక్కిరి చేశాయు. ఘాట్‌రోడ్లలో ముందు వెళుతున్న వాహనాలు, వ్యక్తులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చలితీవ్రత కూడా పెరగడంతో భక్తులు పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇక కొండపై సోమవారం వేకువజామున మొదలైన వర్షం సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా దంచికొట్టింది. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి.

Updated Date - Jan 09 , 2024 | 04:07 AM