Share News

మా సీఎంను కలిసేందుకే టైం లేదు

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:26 AM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు నేనేమీ అపాయింట్‌మెంట్‌ కోరలేదు.

మా సీఎంను కలిసేందుకే టైం లేదు

ఇక టీ సీఎం రేవంత్‌రెడ్డిని ఎక్కడ కలుస్తాం..!: కొడాలి నాని

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు నేనేమీ అపాయింట్‌మెంట్‌ కోరలేదు. మాకు, మా సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకే సమయం లేదు. ఇక పొరుగు రాష్ట్రం సీఎం రేవంత్‌రెడ్డిని ఎక్కడ కలుస్తాం?’ అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘‘తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిచినా అక్కడ రాజకీయాలను జగన్‌ వదిలేశారు. అక్కడ ఏ రాజకీయపార్టీకీ మద్దతు ఇవ్వడం లేదు. తుంటె ఎముకకు సర్జరీ జరిగినందున తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను జగన్‌ పరామర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్‌ను జగన్‌ పరామర్శించడానికి ఆయనకేమీ తుంటె ఎముక సర్జరీ జరగలేదు కదా..? పార్థసారథికి సీటు ఇవ్వడం లేదని సీఎం జగన్‌ ఎక్కడా చెప్పలేదు’’ అని కొడాలి అన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 04:26 AM