Share News

సమ్మె ఆపేది లేదు: సుబ్బరావమ్మ

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:20 AM

ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా అస్ర్తాన్ని ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని, సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీల మూడు సంఘాల సమన్వయ కమిటీ నాయకురాలు సుబ్బరావమ్మ స్పష్టం చేశారు.

సమ్మె ఆపేది లేదు: సుబ్బరావమ్మ

ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా అస్ర్తాన్ని ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని, సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అంగన్వాడీల మూడు సంఘాల సమన్వయ కమిటీ నాయకురాలు సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమైనచర్యని తీవ్రంగా ఖండించారు. ఎస్మా చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది కానీ గౌరవవేతనంతో పని చేస్తున్న అంగన్వాడీలకు వర్తించదనే విషయం తెలుసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Jan 07 , 2024 | 06:56 AM