Share News

కించపరచడమే ‘కొడాలి’ పని: బుద్దా

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:16 AM

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

కించపరచడమే ‘కొడాలి’ పని: బుద్దా

టీడీపీ, జనసేన కూటమికి 160 సీట్లు గ్యారంటీ: కేశినేని శివనాథ్‌

విజయవాడ(వన్‌టౌన్‌), జనవరి 6: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పిచ్చి పట్టిందని ప్రజలు అనుకుంటున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. శనివారం ఆయన టీడీపీ సీనియర్‌ నేత కేశినేని శివనాథ్‌, నాగుల్‌ మీరాతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఎన్‌టీఆర్‌ జిల్లాలో అన్ని నియోజకవర్గాల లో టీడీపీ జండా రెప రెపలాడుతుందన్నారు. కొడా లి నాని ఏ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎక్కడకు వెళ్లాడో గుర్తు చేసుకోవాలన్నారు. నారా, నందమూరి కుటుంబాలను తూలనాడడంతోపాటు లోకేశ్‌ను కూడా నాని అనరాని మాటలన్నాడని విమర్శించారు. మరో సీనియర్‌ నేత కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని తిరువూరులో ఆదివారం తలపెట్టిన ‘రా కదలి రా..!’ సభను అనూహ్యరీతిలో జయప్రదం చేస్తామన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీ-జనసేన కూటమికి 160 సీట్లు గ్యారంటీ అని చెప్పారు.

Updated Date - Jan 07 , 2024 | 04:16 AM