Share News

ఊరంతా వైసీపీయే, కానీ...

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:35 AM

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ సి.కొత్తపల్లి గ్రామం వైసీపీకి కంచుకోట. 90శాతం మంది వైసీపీ మద్దతు దారులే.

ఊరంతా వైసీపీయే, కానీ...

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చాపలమడుగు పంచాయతీ సి.కొత్తపల్లి గ్రామం వైసీపీకి కంచుకోట. 90శాతం మంది వైసీపీ మద్దతు దారులే. వీరికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సురేశ్‌ ఒక్కసారి కూడా అటు వైపు చూడలేదు. ఆరు నెలల క్రితం మంచినీటి కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చి భారీసంఖ్యలో ధర్నా చేశారు. చాపలమడుగు-సి.కొత్తపల్లి మధ్య రెండు కిలోమీటర్ల రహదారిని టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేశారు. ఆ పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో నిలిచిపోయాయి. ఆ తర్వాత రోడ్డు వేసే క్రమంలో పరిచిన కంకర బేబీ చిప్స్‌ సైతం నేడు కనిపించడం లేదు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రిగా పనిచేసినా.. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ‘నాడు-నేడు’ అభివృద్ధి పనులకు నోచుకోలేదు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్డుపై మురుగునీరు పారుతోంది. టీడీపీ హయాంలో వేసిన సీసీ రోడ్లు మినహా కొత్తగా వేసినవి తక్కువే. కేవలం రూ.4లక్షలతో 300అడుగుల సీసీ రోడ్డును మాత్రమే కొత్తగా ఏర్పాటుచేశారు.అయినప్పటికీ, పల్లెలు వెలిగిపోతున్నాయని ప్రభుత్వం డబ్బా కొట్టుకొంటోంది.

Updated Date - Jan 18 , 2024 | 03:35 AM