Share News

దేశ సంపద కొందరి చేతుల్లోనే

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:06 PM

దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి. రామచంద్రయ్య అన్నారు.

   దేశ సంపద కొందరి చేతుల్లోనే
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య

మద్దికెర, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ సంపద కొందరి చేతుల్లోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి. రామచంద్రయ్య అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని ఎం. అగ్రహారం గ్రామంలో దివంగత సీపీఐ జిల్లానాయకుడు హనుమప్ప స్థూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండల సీపీఐ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ మండలంలో సీపీఐ హనుమప్ప చేసిన సేవలు ఎన్నటికీ మరువులేనివన్నారు. హనుమప్ప 20ఏళ్ల పాటు సీపీఐలో పలు పదవులను నిర్వహించారని అన్నారు. ఆయన పోరాట పటిమ ఎన్నటికీ మరువలేమన్నారు. దేశంలో సంపద కేంద్రీకరణ పెరగడంతో పేదరికం ఎక్కువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్‌, జిల్లా టీడీపీ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి భీమలింగప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నబీరసూల్‌, మాజీ ఎంపీటీసీ శివశంకర్‌, మాజీ మండల సీపీఐ కార్యదర్శి డా.వలిసాహహెబ్‌, రామాంజులు, కోదండరాముడు, రంగస్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:06 PM