ఉపాధ్యాయుల పై సస్పెషన్ ఎత్తివేయాలి
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:19 AM
ఆరోగ్య సమస్యలతో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయినా ఉపాధ్యాయులపై ఇచ్చిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏపీ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

ఆదోని (అగ్రికల్చర్), జూన్ 6: ఆరోగ్య సమస్యలతో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయినా ఉపాధ్యాయులపై ఇచ్చిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏపీ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ముఖ్యనాయకుల సమావేశం పట్టణ కార్యదర్శి బడుగు బసవరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ విధులకు కేటాయిస్తూ ఉత్తర్వులకు, ఎలక్షన్ తేదీ నాటికి నెలరోజులు పైగా వ్యవధి ఉండడంతో ఉపాధ్యాయులు కొందరు అనారోగ్యంతో, వివిధ కారణాల చేత శిక్షణ తరగతులకు హాజరు కాకుండా ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయారన్నారు. మానవతా దృక్పథంతో వారిపై విధించిన సస్పెన్షన్ను ఉపసంహరించుకొని, యధావిధిగా విధుల్లో చేర్చుకోవాలని కోరారు. నాయకులు కోటన్న, అలింసిద్ధికి, రామయ్య, రెహమాన్, చంద్రమౌళి, వెంకటేశులు, విజయ్‌కుమార్, సురేష్ కుమార్ పాల్గొన్నారు.