Share News

విత్తనమే నాసి.. ఏం చేసుకోవాలి?

ABN , Publish Date - May 25 , 2024 | 04:04 AM

ఖరీఫ్‌ వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు.

విత్తనమే నాసి.. ఏం చేసుకోవాలి?

అనంతపురం అర్బన్‌/యాడికి, మే 24: ఖరీఫ్‌ వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఆర్బీకేల్లో విత్తన వేరుశనగ పంపిణీని అధికారులు ప్రారంభించారు. విత్తన కాయల కోసం ఆత్రంగా వచ్చిన రైతులు.. వాటి నాణ్యతను చూసి ఉసూరుమన్నారు. ‘విత్తనంలో నాసులు, పుచ్చులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తీసుకువెళ్లి ఏంచేయాలి? ఆలస్యమైనా పర్వాలేదు. నాణ్యమైన విత్తనాలే ఇవ్వండి’ అంటూ కల్లుమడి, యాడికి, ఎ.నారాయణపురం ఆర్బీకేల్లో రైతులు విత్తనాలు తీసుకోకుండానే వెనుదిరిగారు.

Updated Date - May 25 , 2024 | 04:04 AM