Share News

సీఎం ప్రమాణస్వీకారానికి తరలిన శ్రేణులు

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:19 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాల్గవ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతిలో చేయనున్న ప్రమా ణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తంబళ్లపల్లె మండలం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

సీఎం ప్రమాణస్వీకారానికి తరలిన శ్రేణులు
ప్రమాణస్వీకారానికి తరలివెళుతున్న తంబళ్లపల్లె టీడీపీ నాయకులు బి.కొత్తకోట నుంచి బస్సులో తరలివెళుతున్న నాయకులు

తంబళ్లపల్లె, జూన 11: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాల్గవ సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతిలో చేయనున్న ప్రమా ణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తంబళ్లపల్లె మండలం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల నుంచి కూటమి నాయకులు, కార్యక ర్తలు తంబళ్లపల్లె మండల కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి బస్సు ల్లో ఉత్సాహంగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత మండలాధ్యక్షుడు గంగరాజు, యూనిట్‌ ఇనచార్జి కాలానారాయణ, తెలుగు యువత కార్యనిర్వాహణ కార్యదర్శి మధుసూధన, సాంబశివ, వెంకటరెడ్డి, వీరాంజినేయులు, మ్యూజికల్‌శివ, టైల్స్‌శీన, అశోక్‌, మధు, మల్లేష్‌, అంజి, పీర్లమాబు, చాంద్‌బాషా, టైలర్‌మనాప్‌, రషీద్‌బాషా, ఐసులకిట్ట తదితరులు ఉన్నారు.

నిమ్మనపల్లిలో: మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు బుధ వారం ముఖ్యమంత్రిగా నారాచంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారో త్సవ కార్యక్రమానికి మంగళవారం అమరావతి బయలుదేరి వెళ్లారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ గత 5ఏళ్లుగా వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారన్నారు. ప్రస్తుతం టీడీపీ గెలుపు తో స్వేచ్చగా బతికే అవకాశం వచ్చిందని తెలిపారు. తామంతా ముఖ్య మంత్రిగా చంద్రబాబానాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతు న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమణ, నాయ కులు చెండ్రాయుడు, శంకర, శ్రీనివాసులు, బాబు, విజయ్‌, మల్లప్ప, రెడ్డినారాయణ తదితరులు వున్నారు.

కలికిరిలో: విజయవాడలో రాష్ట్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకా రోత్సవానికి కలికిరి మండలం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి అన్ని పంచాయతీలకు చెందిన నాయ కులు, కార్యకర్తలు వాహనాలు సమకూర్చుకుని వెళ్లారు. మంత్రివర్గంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డికి చోటు దక్కనుందన్న అంచనాతో పలువురు కార్యకర్తలు, అభిమా నులు ఆయన ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించాలన్న కుతూ హలంతో శ్రేణులన్నీ విజయవాడ బాట పట్టాయి. కాగా మంగళవారం ఉదయం విజయవాడ లో జరిగిన ఎనడీఏ శాసన సభాపక్ష సమావే శానికి కిశోర్‌కుమార్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్యేలం దరికీ నారాలోకేష్‌ పేరు పేరునా పలకరించి అభినందిం చడంతోపాటు అభివాదాలు చేశారు..

బి.కొత్తకోటలో: మహాకూటమి ఘనవిజయం సాధించి బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా బి.కొత్తకోట మండలం నుంచి పలువురు కార్యకర్తలు విజ యవాడకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఆశీనులు కావడం ఆనందంగా ఉందన్నారు. విజ యవాడకు తరలివెళ్లిన వారిలో మండల కన్వీనర్‌ నారాయణస్వామి రెడ్డి, కనకంటి ప్రసాద్‌, బంగారువెంకట్రమణ, గంజిమోహన ఉన్నారు.

పెద్దమండ్యంలో: ఏపీ సీఎంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చం ద్రబాబునాయుడు ప్రమాణ స్వ్జీకారోత్సవ కార్యక్రమానికి పెద్దమండ్యం మండల ఎనడీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు విజయవాడకు తరలివెళ్లారు. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన నేపథ్యంలో కార్యకర్తలు నూతనోత్సహంతో ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లారు. రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి మనోహ ర్‌నాయక్‌, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు నానాబాల ప్రసాద్‌, రామాంజులునాయుడు, రామాంజులు, మోకానిక్‌ ఆనంద్‌, సుబ్బరా మిరెడ్డి, ప్రభాకరరెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.

Updated Date - Jun 11 , 2024 | 11:19 PM