రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్న అతి పేదవాడు!
ABN , Publish Date - Feb 21 , 2024 | 04:48 AM
సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పట్టిన దరిద్రమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తా రు.
ఎన్నికలు జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం: లోకేశ్
స్కూళ్ల విలీనంతో చదువుకు పేద పిల్లలు దూరం.. ఏపీలోనే అత్యధిక డ్రాపవుట్స్
మేమొచ్చాక జీవో 117ను రద్దు చేస్తాం.. ఉత్తరాంధ్రను భ్రష్టుపట్టించారు
ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేదు.. ఉన్నవి కూడా ‘గుడ్డు మంత్రి’ దెబ్బకు పరార్
మేమొస్తే పథకాలు రద్దు చేస్తామన్న ప్రచారాన్ని నమ్మొద్దు: శంఖారావంలో వినతి
మాడుగుల/నర్సీపట్నం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి పట్టిన దరిద్రమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తా రు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. పేదలు, పెత్తందారులకు మధ్య యుద్ధమని ఆయన పదే పదే అంటున్నాడని, నిజమే.. జగన్ రూ.లక్ష కోట్లు ఆస్తి ఉన్న పేదవాడని ఎద్దేవా చేశారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా మంగళవారం అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం సురవ రం, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గంలో ని కోటవురట్లలో జరిగిన సభల్లో మాట్లాడారు. రానున్న ఎన్నికలు జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమన్నారు. పాఠశాలల విలీనం నిర్ణయం తో పేద పిల్లలను ఆయన చదువుకు దూరం చేశాడని విమర్శించారు. దేశంలో డ్రాపౌట్లు 12.6 శాతం ఉంటే, దక్షిణ భారతంలో అత్యధికంగా ఏపీలోనే 16.3 శాతం ఉందని చెప్పారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే 117 జీవో(పాఠశాలల విలీనానికి ఉద్దేశించినది) రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తారని వలంటీర్ల ద్వా రా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. ఇంకా ఏమన్నారంటే..
బూతులకు రత్నాలు..
ఎన్నికలకు ముందు నవరత్నాలని చెప్పి, గెలిచాక బూతులకు రత్నాలిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి బూ తురత్నం ‘సన్న బియ్యం సన్నాసి’ కొడాలి నాని. జగన్ కు బాగా ఇష్టమైనవి బూతులే. ప్రతి రోజూ అవి విన్నా కే నిద్రపోతాడు. జగన్ అరాచక పాలనకు సహకరిస్తున్న అందరి పేర్లూ రెడ్‌బుక్‌లో రాస్తున్నాను. మాది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం. మేం ప్రజల్లో ఉంటే, జగన్ పరదాల చా టున ఉంటాడు. టెన్త్ పరీక్ష పత్రాల దొంగతనం కేసు లో ఆయన్ను హైదరాబాద్‌లో పంజాగుట్ట ఎస్‌ఐ చితకబాదారు. గడచిన నాలుగున్నరేళ్లలో 32 వేల పాఠశాల ల్లో ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలకు రంగులు వేయించి తన ప్రభుత్వమే కట్టినట్లు జగన్ గొప్పలు చెప్పుకొంటున్నాడు. ఉత్తరాంధ్రను జగన్ భ్ర ష్టు పట్టిస్తున్నాడు. ఈ ఐదేళ్లలో ఈ ప్రాంతానికి కొత్త గా ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు. మా హయాంలో విశాఖ జిల్లాకు పరిశ్రమలు తీసుకువస్తే... కోడిగుడ్డు మంత్రి దెబ్బకు అవన్నీ పారిపోతున్నాయి. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా బాధ్యత తీసుకుంటాం.
ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే!...
వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అనేక కేసులు పెట్టారు. నాపైనా 22 కేసులు పెట్టారు. అందులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులూ ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే. 2019కి ముందు ఏనాడూ పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికి ఏడుసార్లు స్టేషన్‌కు పిలిచారు. పదిహేనేళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన నేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలులో నిర్బంధించారు. టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ కుట్రలు పన్నుతోంది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ‘హలో ఏపీ, బైబై వైసీపీ...’ నినాదానికి కట్టుబడి ఉండాలి. చంద్రబాబును ముసలోడని జగన్‌రెడ్డి అంటున్నాడు. తిరుపతి కొండను జగన్, చంద్రబాబు ఒకేసారి ఎక్కితే ఎవరు ముందు ఎక్కి దిగుతారో తేలిపోతుంది. బస్సు దిగాలన్నా జగన్‌కు స్టూల్ ఉండాలి, కొబ్బరికాయ కొట్టాలన్నా ఆ రాయిని ఇద్దరు పైకి ఎత్తితే తప్ప కొట్టలేని పరిస్థితి.
రూ.లక్ష విలువ చేసే చెప్పులు, వెయ్యి రూపాయల మంచినీటి బాటిల్ తాగే అతి పేదవాడు జగన్.. భారతీ సిమెంట్స్, సండూరు పవర్, పేపర్, చానల్, హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిల్లో ప్యాలె్‌సలు ఉన్న పేదవాడు.
చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను, నన్ను బూతులు తిట్టాలని కలెక్టర్లను, నాయకులను ఆదేశించడం సిగ్గుచేటు. మమ్మల్ని తిడితేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ అని షరతు పెడుతున్నారు.
- లోకేశ్
10 రోజులు.. 31 నియోజకవర్గాలు
‘శంఖారావం’లో 1,225 కిమీ ప్రయాణం
ఉత్తరాంధ్రలో టీడీపీ యువనేత లోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర మంగళవారంతో ముగిసింది. గత పది రోజుల్లో 31 నియోజకవర్గాలను ఆయన చుట్టేశారు. 1,225 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సభలకు జనం భారీఎత్తున హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రెండు నెలల్లో రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో టీడీపీ శ్రేణులకు ఆయ న దిశానిర్దేశం చేశారు. 11న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించిన యాత్ర.. పార్వతీపు రం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల మీదుగా అనకాపల్లి జిల్లా వరకు సాగింది. సగటు న రోజుకు మూడు నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహించారు. బాగా పనిచేసిన నేతలు, కార్యకర్తలను గుర్తించి సర్టిఫికెట్లు అందించారు.