టీడీపీ జెండా కట్టాడని.. కార్యకర్తను చితకబాదిన పోలీసులు
ABN , Publish Date - Mar 03 , 2024 | 02:59 AM
ఇంటిపై టీడీపీ జెండా కట్టుకున్నందుకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం జీనవాండ్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త హనుమంతును పోలీసులు చితకబాదారు.
గోరంట్ల, మార్చి 2: ఇంటిపై టీడీపీ జెండా కట్టుకున్నందుకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం జీనవాండ్లపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త హనుమంతును పోలీసులు చితకబాదారు. గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు హనుమంతు, లక్ష్మీపతి స్నేహితులు. లక్ష్మీపతి ఇటీవల వైసీపీలో చేరి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మంత్రి ఉష శ్రీచరణ్ భర్త, వైసీపీ నాయకుడు చరణ్‌రెడ్డి శుక్రవారం జీనవాండ్లపల్లిలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో హనుమంతు ఇంటిపై టీడీపీ జెండా ఉండటంతో లక్ష్మీపతి అభ్యంతరం తెలిపాడు. ఆయన కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం రాత్రి పోలీసులు హనుమంతును స్టేషన్‌కు పిలిపించి చితకబాదారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పెనుకొండ ఇన్‌చార్జి సవితమ్మ.. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేయడంతో హనుమంతును వదిలేశారు. ఈ విషయంపై సీఐ సుబ్బరాయుడును వివరణ కోరగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినందున ఇరువర్గాల వారిని పిలిచి మందలించామే తప్ప.. కొట్టలేదని చెప్పారు.