అంగనవాడీ కేంద్రం పక్కనే గుంత
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:28 PM
మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కాలనీలోని చిన్మయ్‌నగర్-1వ అంగనవాడీ కేంద్రం పక్కన గుంత ప్రమాదకరంగా ఉంది.

రాప్తాడు, జూన 17: మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కాలనీలోని చిన్మయ్‌నగర్-1వ అంగనవాడీ కేంద్రం పక్కన గుంత ప్రమాదకరంగా ఉంది. ఆలయ ప్రహరీ నిర్మాణం కోసం స్థానికులు పెద్ద గుంత తవ్వి.. దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేశారు. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో గుంతలోకి వర్షపు నీరు ఎక్కువగా చేరాయి. రోజూ అంగనవాడీ కేంద్రానికి దాదాపు 15 మంది చిన్నారులు వస్తుంటారు.
వారు ప్రమాదవశాత్తు జారిపడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఆ నీటి వల్ల భవనమూ దెబ్బతిని కూలే ప్రమాదముందన్నారు. కావున ఆ గుంతను వెంటనే పూడ్చివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.