Share News

ఉద్యమం ఉధృతం

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:03 AM

40 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న పోరాటం ఉధృత రూపం తీసుకుంది.

ఉద్యమం ఉధృతం
పాములపాడులో రాస్తారోకో చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

ప్రభుత్వ నిర్లక్ష్యంపై అంగన్‌వాడీల కన్నెర్ర

జిల్లా వ్యాప్తంగా రహదారులపై నిరసన

40వ రోజుకు చేరిన అంగన్‌వాడీల దీక్షలు

40 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న పోరాటం ఉధృత రూపం తీసుకుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా రహదారులను నిర్బందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి రాస్తారోకోలు చేశారు. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు అంగన్‌వాడీల ఉద్యమానికి బాసటగా నిలిచారు. ‘ మేం గొంతెమ్మ కోరికలు కోరలేదు.. రూ.11 వేల జీతంతో మా కుటుంబాలు ఎలా బతకాలి? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు లేదు. 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా కనీస కనికరం లేదు. ఈ ప్రభుత్వాని బుద్ధి చెప్పక తప్పదు’ అంటూ అంగన్‌వాడీ వర్కర్లు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పారబట్టారు.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

Updated Date - Jan 21 , 2024 | 12:03 AM