Share News

గాయపడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:05 AM

కందనాతి గ్రామంలో ఈ నెల 21న జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహులు(53) మృతిచెందాడు.

గాయపడిన వ్యక్తి మృతి

కందనాతిలో కొనసాగుతున్న పోలీస్‌ పికెటింగ్‌

ఎమ్మిగనూరు రూరల్‌, ఫిబ్రవరి 28: కందనాతి గ్రామంలో ఈ నెల 21న జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహులు(53) మృతిచెందాడు. రూరల్‌ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి, గ్రామస్థుల వివరాల మేరకు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన నరసింహులు కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

నిందితులు అరెస్టు: కందనాతి గ్రామంలో ఘర్షణ కు పాల్పడి ఇద్దరు వ్యక్తుల మృతికికారణమైన 12 మంది నిదితులను బుధవారం రూరల్‌ సీఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి, పోలీసు సిబ్బంది దాడి చేసి అరెస్టుచేశారు. సీఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు నిందితులు గ్రామ సమీపంలో ఉన్న బోయ నరసయ్య పొలంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద ఉన్నారన్న సమాచారంతో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బోయ గోవిందు, బోయ లోకేష్‌, బోయ వెంకటేష్‌, బోయ శ్రీను, బోయ నరసయ్య, బోయ పరమేష్‌, బోయ మారెన్న, బోయ ఈరన్న, బోయ కేశన్న అలియాస్‌ గొర్రెల కేశన్న, బోయ మహేష్‌, బోయ కేశన్న అలియాస్‌ గువ్వోడు, బోయ మారెన్న ను కోర్టులో హాజరు పరచగా జడ్జీ రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 12:05 AM