Share News

కోరి తెచ్చుకున్న సర్కారే మోసం చేసింది

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:08 AM

కోరి తెచ్చుకున్న ప్రభుత్వం తమను మోసం చేసిందని బహుజన ఉపాధ్యాయ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

కోరి తెచ్చుకున్న సర్కారే మోసం చేసింది

బహుజన ఉపాధ్యాయుల ఆవేదన...విజయవాడలో ధర్నా

విజయవాడ(ధర్నాచౌక్‌), ఫిబ్రవరి 5: కోరి తెచ్చుకున్న ప్రభుత్వం తమను మోసం చేసిందని బహుజన ఉపాధ్యాయ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో తమకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం దారుణమన్నారు. అపరిషృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కరించాలని లేదంటే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో సోమవారం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టెటి రమేష్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను చులకనగా చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 04:08 AM