దోషులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:59 PM
కోలకత్తాలో వైద్యురాలిని కిరాతకంగా హతమార్చిన దోషులను కఠినంగా శిక్షించాలని అంగనవాడీలు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ కూడలివద్ద మానవహారంగా ఏర్పడి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగనవాడీ కార్యకర్తల సంఘం నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కొత్తచట్టాలు
హిందూపురం(సోమందేపల్లి), ఆగస్టు 21: కోలకత్తాలో వైద్యురాలిని కిరాతకంగా హతమార్చిన దోషులను కఠినంగా శిక్షించాలని అంగనవాడీలు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ కూడలివద్ద మానవహారంగా ఏర్పడి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగనవాడీ కార్యకర్తల సంఘం నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని కొత్తచట్టాలు తెచ్చినా చిన్నారులు, మైనర్లపై లైంగిక దాడులు ఆగకపోవడం దారుణమన్నారు. పశ్చిమ బెంగాల్ ఘటన మహిళా లోకానికే సిగ్గుచేటన్నారు. కఠిన శిక్షలతోనే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు.
అగళి : కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అంగనవాడీ డిమాండ్ చేశారు. స్థానిక బస్టాండ్‌లో వారు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయాలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోరంట్ల : ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యురాలిపై జరిగిన దుర్ఘటనపై యావత ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని ఉదయ్‌కిరణ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూధన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులు గోరంట్ల ప్రధాన రహదారిపై నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
చిలమత్తూరు : కలకత్తాలో వైద్యురాలిపై కిరాతకాన్ని ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మహిళలను కామాంధుల నుంచి రక్షించాలని, స్త్రీలకు హాని తలపెట్టే వారిపై కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు ప్రవీణ్, వెంకటేశ, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం అర్బన : మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చట్టాలు తీసుకురావాలని విద్యార్థినీలు పేర్కొన్నారు. ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన ఆధ్వర్యంలో వైద్యురాలి హత్యను నిరసిస్తూ విద్యార్థులు సంఘీభావ ర్యాలీచేపట్టారు బుధవారం పట్టణ పరిధిలోని చిన్నమార్కెట్, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి ఎంఎ్‌ఫరోడ్డు, అంబేద్కర్ సర్కిల్ మీదుగా మేళాపురం తెలుగుతల్లి విగ్రహం వరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఎనలైట్ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.