Share News

వడగాడ్పులతో జనం బెంబేలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:33 AM

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సోమవారం ఎండతో ఉడికిపోయాయి. వడగాడ్పులతో ప్రజలు ఠారెత్తిపోయారు. ప్రధానంగా ఉత్తర కోస్తాలో గాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాలకొండ, వీరఘట్టంలో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర

వడగాడ్పులతో జనం బెంబేలు

అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సోమవారం ఎండతో ఉడికిపోయాయి. వడగాడ్పులతో ప్రజలు ఠారెత్తిపోయారు. ప్రధానంగా ఉత్తర కోస్తాలో గాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాలకొండ, వీరఘట్టంలో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. మంగళవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 63 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 130 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు ఉంటాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమ, దక్షిణకోస్తాలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Apr 16 , 2024 | 07:39 AM