Share News

‘నిస్తార్‌’ యుద్ధనౌక నిర్మాణం పూర్తి

ABN , Publish Date - May 29 , 2024 | 03:44 AM

భారత నౌకాదళం కోసం నిస్తార్‌ యుద్ధ నౌక నిర్మాణం చేపట్టిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎ్‌సఎల్‌) మూడు దశాబ్దాల కృషితో దాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.

‘నిస్తార్‌’ యుద్ధనౌక నిర్మాణం పూర్తి

80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన హెచ్‌ఎస్‌ఎల్‌

విశాఖపట్నం/మల్కాపురం, మే 28 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం కోసం నిస్తార్‌ యుద్ధ నౌక నిర్మాణం చేపట్టిన హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎ్‌సఎల్‌) మూడు దశాబ్దాల కృషితో దాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. నేవీకి అవసరమైన డైవింగ్‌ సపోర్ట్‌ వెజల్‌ (యుద్ధ నౌక నిస్తార్‌) నిర్మాణానికి హెచ్‌ఎ్‌సఎల్‌ 1993లో శ్రీకారం చుట్టింది. ఎట్టకేలకు దాన్ని పూర్తిచేసి సోమవారం ఉదయం సముద్రంలో ట్రయల్స్‌కు పంపించింది. అన్ని పరీక్షలనూ విజయవంతంగా పూర్తిచేసుకొన్న నిస్తార్‌ అదే రోజు సాయంత్రం తిరిగి హెచ్‌ఎ్‌సఎల్‌ జెట్టీకీ చేరింది. ఇక్కడ యుద్ధనౌక తయారు కావడం ఎంతో గర్వకారణమని, అంతకు ముందు కొరియా సహకారంతో ఐఎన్‌ఎస్‌ సుజాత యుద్ధనౌకను నిర్మించామని షిప్‌యార్డు వర్గాలు వెల్లడించాయి. నేవీ కోసం నిర్మించిన నిస్తార్‌లో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించామని షిప్‌యార్డు తెలిపింది.

Updated Date - May 29 , 2024 | 03:44 AM