Share News

మార్పుచేర్పులపై.. తెగని సీఎం కసరత్తు!

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:13 AM

ముందుగానే వైసీసీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల జాబితాను వెల్లడిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సీఎం జగన్‌.

మార్పుచేర్పులపై.. తెగని సీఎం కసరత్తు!

మలి జాబితా నేడు ప్రకటించే చాన్సు

తాడేపల్లికి తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు

దర్శన భాగ్యం కల్పించని జగన్‌.. కర్నూలు ఎంపీకి మంత్రి జయరాం

అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): ముందుగానే వైసీసీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల జాబితాను వెల్లడిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సీఎం జగన్‌.. ఇప్పటికి 35 మంది అసెంబ్లీ, ముగ్గురు లోక్‌సభ అభ్యర్థులను మాత్రమే ఖరారు చేశారు. టికెట్లు దక్కని నేతలు, దక్కవని అధిష్ఠానం నుంచి సంకేతాలు అందుకున్నవారు.. పార్టీని వీడుతున్నారు. ప్రజల్లో తమపై వ్యతిరేకత లేదని.. ప్రభుత్వంపైనే ఉందని.. సీఎం తమను కనీసం మర్యాదకైనా పిలిపించి మాట్లాడడం లేదని.. తాడేపల్లి ప్యాలె స్‌కు వెళ్లినా దర్శనమివ్వడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయాలతో సం బంధం లేని సీఎంవో అధికారి ధనుంజయరెడ్డితో, ప్రాంతీయ సమన్వయకర్తలతో మాత్రమే మాట్లాడి వెనుదిరగాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువు రు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, కాంగ్రెస్‌ వైపు చూస్తుండడంతో జగన్‌ ఆందోళన చెందుతున్నారు. బుధవారం ప్రకటిస్తామన్న జాబితాను గురువారం విడుదల చేసే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. బుధవారం మంత్రులు గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్‌, పలువురు ఎమ్మెల్యేలు సీఎంవోకు తరలివచ్చారు. ఎంపీ సంజీవ్‌కుమార్‌ను సాగనంపి.. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా జయరాంను బరిలో దింపాలని జగన్‌ నిర్ణయించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆలూరు అసెంబ్లీ ఇన్‌చార్జిగా విరూపాక్షిని ఖరారు చేసినట్లు తెలిసింది. అంతకు ముందు విజయనగరం లోక్‌సభకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, విశాఖకు బొత్స ఝాన్సీ సహా పలువురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఈ జాబితాను వైసీపీ ధ్రువీకరించలేదు. పెందుర్తి సిటింగ్‌ ఎమ్మెల్యే అదీ్‌పరాజ్‌ను తొలగించి అక్కడ మంత్రి అమర్నాథ్‌కు అవకాశమిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా వీరిద్దరూ కలిసి సీఎంవోకు రావడం గమనార్హం. బయటకు వచ్చిన తర్వాత అమర్నాథ్‌ మీడియాతో మా ట్లాడారు. ఈ నెలలో రూ.2,500 కోట్లతో అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయాల్సి ఉందని.. దీనిపై సీఎంతో చర్చించామని చెప్పారు. సీట్ల మార్పులపై చర్చేమీ జరగలేదన్నారు. పెందుర్తి, చోడవరంలలో ఏదో ఒక చోట తనను పోటీ చేయిస్తారన్నది ప్రచారం మాత్రమేనని చెప్పారు. తనకెలాంటి గాబరా లేదని.. తన భవిష్యత్‌ను జగన్‌ నిర్ణయిస్తారని.. వ్యాఖ్యానించారు. అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశాక.. ఆయన ఏ పార్టీలోకి వెళ్తే తమకేంటని ప్రశ్నించారు. జనసేనలో రాయుడు ఏం చేస్తాడో.. ఎన్నాళ్లుంటాడో చూద్దామన్నారు. తనను మండపేట నుంచి పోటీ చేయమన్నారని, తాను అక్కడే బరిలోకి దిగనున్నట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు చెప్పారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, రాజానగరం, చోడవరం ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కరణం ధర్మశ్రీ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కూడా సీఎంవోకు వచ్చారు.

Updated Date - Jan 11 , 2024 | 03:13 AM