కూటమి విజయం చారిత్రాత్మకం
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:11 AM
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి జి.రామకృష్ణ,

చంద్రబాబు, లోకేశ్‌కు సచివాలయ ఉద్యోగుల శుభాకాంక్షలు
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి జి.రామకృష్ణ, ఇతర సచివాలయ ఉద్యోగులు గురువారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమని, ఇందులో ఉద్యోగులు ప్రముఖ పాత్ర పోషించిన అంశాన్ని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తుచేశారు. వైసీపీ హయాంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీంతో ఉప్పెనలా కదిలొచ్చి ఓట్లు వేశారని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారీతిన అక్రమంగా బదిలీలు చేశారని, దీంతో అర్హత ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు.