Share News

తంబళ్లపల్లెలో లక్ష సభ్యత్వాలు చేయించడమే లక్ష్యం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:49 PM

తంబళ్లపల్లె నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచం ద్రారెడ్డి పేర్కొన్నారు.

తంబళ్లపల్లెలో లక్ష సభ్యత్వాలు చేయించడమే లక్ష్యం
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి

ములకలచెరువు, అక్టోబరు 25(ఆంధ్ర జ్యోతి): తంబళ్లపల్లె నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తంబళ్లపల్లె నియోజక వర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచం ద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జరిగిన తంబ ళ్లపల్లె నియోజకవర్గ కార్యకర్తల సమావే శంలో ఆయన మాట్లాడుతూ శనివారం నుంచి ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదును పండగ వాతావరణంలా చేపట్టాలన్నారు. జిల్లాలోనే అత్యధికంగా సభ్యత్వాలు చేపట్టి ప్రథమ స్థానంలో నిలుద్దామన్నారు. సభ్యత్వం చేసు కున్న వారికి ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇన్సూరెన్సు ఉంటుందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ పర్వీనతాజ్‌ మట్లాడుతూ సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ, తంబళ్లపల్లె మండల అధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి, నేతలు విశ్వనాధరెడ్డి, తులసీధర్‌నా యుడు, కట్టా సురేంద్రనాయుడు, డేరంగుల నారాయణ, రాఘవరెడ్డి, నాయకులు భజంత్రి రామాంజులు, రషీద్‌, గోపాల్‌రాజు, బుర్రా రమణ, మూగి రవిచంద్ర, భాస్కర్‌రెడ్డి, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:49 PM