Share News

టెట్‌ ప్రశాంతం

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:50 PM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు 87 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మంగళవారం ఏడు కేంద్రాల్లో రెండు సెషన్స్‌లో అన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు.

టెట్‌ ప్రశాంతం
ఆన్‌లైన్‌ పరీక్షలను పర్యవేక్షిస్తున్న జిల్లా పరిశీలకులు ఎంవీ క్రిష్ణారెడ్డి

తొలిరోజు పరీక్షకు 87 శాతం మంది హాజరు

కడప (ఎడ్యుకేషన్‌), ఫిబ్రవరి 27: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు 87 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మంగళవారం ఏడు కేంద్రాల్లో రెండు సెషన్స్‌లో అన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన మొదటి సెషన్‌లో 847 మంది హాజరు కావాల్సి ఉండగా 715 మంది హాజరయ్యారు. 132 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 860 మందికి గాను 785 మంది హాజరు కాగా 75 మంది గైర్హాజరయ్యారు. రెండు సెషన్లకు సంబంధించి 1,707 మందికి గాను 1,500 మంది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలను జిల్లా పరిశీలకులు మోడల్‌ స్కూల్స్‌ జేడీ ఎంవీ క్రిష్ఱారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు. అభ్యర్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమకూర్చామన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:50 PM