Share News

టెట్‌ భారం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:07 AM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) నిరుద్యోగులకు భారంగా మారింది.

టెట్‌ భారం

నిరుద్యుగులతో జగన్‌ ప్రభుత్వం ఆటలు

సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు

నేటి నుంచి ఆరంభం కానున్న టెట్‌ పరీక్షలు

ఆలూరు, ఫిబ్రవరి 26: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) నిరుద్యోగులకు భారంగా మారింది. నోటిఫికేషన్‌ ఇచ్చిన పది రోజుల గడువులో పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇతర రాష్ర్టాలకు, జిల్లాలకు వెళ్లాల్సిందే

టెట్‌ పరీక్ష కేంద్రాలు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు కేటాయించడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికే టెట్‌, డీఎస్‌స్సీకు కలిపి రూ.1500 చెల్లించారు. హైదరాబాద్‌, బెంగళూర్‌, రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు పరీక్ష కేంద్రాలను వేయడంతో సుదూర ప్రాంతాలకు వ్యయప్రయాసలతో వెళ్లా ల్సినప పరిస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని వాపోతున్నారు.

హడావుడిగా పరీక్షలు

టెట్‌ పరీక్షల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం హడావుడిగా జారీ చేయడంతో కనీసం పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి నుంచి ఆరంభం కానున్న టెట్‌ పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) మంగళవారం నుంచి ఆరంభం కానున్నాయి. సుదూర ప్రాంతాల్లో సెంటర్లు పడిన అభ్యర్థులు సోమవారమే వ్యయ ప్రయాసలతో తరలి వెళ్లారు.

Updated Date - Feb 27 , 2024 | 12:07 AM