Share News

Hero Balakrishna : ‘‘బావ.. బయల్దేరాడని చెప్పండి’’!

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:01 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. ఏపీలో టీడీపీ గెలుపు సంబురాలను తెలంగాణవ్యాప్తంగానూ ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ,

Hero Balakrishna : ‘‘బావ.. బయల్దేరాడని చెప్పండి’’!

ఏపీలో టీడీపీ గెలుపుతో నెట్టింట వైరల్‌గా మారిన బాలయ్య డైలాగ్‌

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో స్టేటస్‌, పోస్టింగ్స్‌ జోరు

ఏపీలో గెలుపుతో తెలంగాణలోనూ టీడీపీ శ్రేణుల సంబురాలు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుబి మోగించడంతో ఆ పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. ఏపీలో టీడీపీ గెలుపు సంబురాలను తెలంగాణవ్యాప్తంగానూ ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మాదాపూర్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ అభిమానులు బాణాసంచా పేల్చుతూ బైక్‌ ర్యాలీలు తీశారు. అలాగే కార్లకు టీడీపీ జెండాలు కట్టి ర్యాలీలు నిర్వహించారు. ఏపీలో టీడీపీ కూటమి బంపర్‌ మెజార్టీ సీట్లతో గెలవడంతో సోషల్‌మీడియాలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో కూడిన మీమ్స్‌, రీల్స్‌ హోరెత్తిస్తున్నాయి. యువత సహా టీడీపీ అభిమానులు, పార్టీ శ్రేణులు ‘‘నారా చంద్రబాబునాయుడు అనే నేను’’ అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ ఆయన గతంలో ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను స్టేట్‌సలుగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ‘‘పైసా వసూల్‌’’ సినిమాలో బాలకృష్ణ చెప్పిన ‘‘బాబ్‌మార్లేకు చెప్పు బావ బయల్దేరాడని’’ అనే డైలాగ్‌లో బాబ్‌మార్లేను తీసేసి.. ‘‘బావ.. బయల్దేరాడని చెప్పండి’’ అనే డైలాగ్‌ను యూత్‌ సహా పార్టీ శ్రేణులు, అభిమానులు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో పోస్ట్‌ చేయడంతోపాటు స్టేట్‌సలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Updated Date - Jun 05 , 2024 | 06:01 AM