Share News

జనం నమ్మకాన్ని జగన్‌ వమ్ము చేశారు: ఆనం

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:17 AM

వైసీపీకి ఓట్లేసిన 1.31 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని జగన్‌ వమ్ము చేశారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు.

జనం నమ్మకాన్ని జగన్‌ వమ్ము చేశారు: ఆనం

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీకి ఓట్లేసిన 1.31 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని జగన్‌ వమ్ము చేశారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం.. వారికి ఓటేసిన ప్రజల్ని మోసం చేయడమే. వైసీపీకి జనం 11 సీట్లే ఇస్తే.. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వాలి? సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్‌ ఏ అర్హత ఉందని ప్రతిపక్ష హోదా అడుగుతున్నారో చెప్పాలి. అసెంబ్లీకే రానప్పుడు ఎమ్మెల్యేలుగా జీతభత్యాలు, గన్‌మేన్లు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు వద్దని స్పీకర్‌కు లేఖ రాసి, జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి. రాజకీయాల్లో ఎన్నికల సమయంలోనే ప్రత్యర్థులుగా పోరాడాలని, ఆ తర్వాత ప్రజల కోసం పని చేయాలనే జ్ఞానం జగన్‌కు లేదు. ఆయన మానసిక స్థితి బాలేదు. ఎక్స్‌లో, ప్రెస్‌మీట్లలో వింతగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి, లండన్‌లోని మెంటల్‌ ఆసుపత్రిలో చూపించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా. జగన్‌ మానసిక స్థితి బాగుపడేవరకు భారతీరెడ్డిని పార్టీ అధ్యక్షురాలిని చేయాలని వైసీపీ నేతలకు సూచిస్తున్నా’ అని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 03:17 AM