టీడీపీ సభ్యత్వ నమోదు
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:35 AM
పట్టణంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం ప్రారంభిం చారు.
కదిరి, అక్టోబరు 26 (ఆంరఽధజ్యోతి) : పట్టణంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం ప్రారంభిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... రూ వందతో రూ. ఐదు లక్షల బీమా కల్పించడం హర్షిచతగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఫర్వీనాబాను, అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్షాన, బాహుద్దీన, కుటాగుళ్ల శంకర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటి సమస్యను పరిష్కరించుకోలేని జగన..
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి ఇంటి సమస్యను పరిష్కరించుకోలేక తల్లిని, చెల్లిని కంటతడి పెట్టిస్తున్నారని, అలాంటి వాడు రాష్ట్ర సమస్యలను ఎలా పరిష్కరిస్తారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అందుకే జగనను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశార న్నారు. కదిరిలో కొంతమంది వైసీపీ నాయకులు తప్పులు చేశారని, అందుకే 40 రోజులుగా పరారీలో ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై 23 కేసులు పెట్టారని, అందులో హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులున్నాయని, వాటికి భయపడి తాను ఏనాడు ఊరి వదిలి పారిపోలేదని అన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేసిన వైసీపీ నాయకులు సరైన లేఅవుట్ వేసి ప్రజలకు న్యాయం చేయాలని, లేకపోత చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.