Share News

పత్తికొండ టీడీపీకి అండ

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:25 AM

ఎన్నికల ఫలితాల్లో పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది.

పత్తికొండ టీడీపీకి అండ

ఐదు మండలాల్లో టీడీపీ విజయకేతనం

వైసీపీ ఆశలపై నీళ్లు చల్లిన పత్తికొండ, వెల్దుర్తి మండలాలు

రౌండ్‌రౌండ్‌లో టీడీపీదే ఆధిక్యం

పత్తికొండ,జూన్‌6: ఎన్నికల ఫలితాల్లో పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ విజయకేతనం ఎగరవేసింది. పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి ఐదుమండలాలలో మెజార్టీసాదించి వైసీపీకి కోలుకోలేని దెబ్బతీసింది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,23,603 మంది ఓటర్లు ఉండగా 1,89,645 మంది ఈవీఎంలద్వారా, 2,258 మంది పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో 272 పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లుచెల్లనివిగా తీసివేశారు. తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానపార్టీలైన టీడీపీ, వైసీపీల నడుమే పోటీ సాగింది. నియోజకవర్గం మొత్తంగా వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవికి 84,638 ఓట్లురాగా, టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు 98,849 ఓట్లు లభించి 14,211 మెజార్టీతో టీడీపీ గెలుపొందింది. టీడీపీ ఆవిర్భాం నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ ఏడుసార్లు విజయం సాధించగా 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ఓటమిని చవిచూసింది. ఈసారి ఎన్నికల్లో పత్తికొండలో టీడీపీ విజయం సాధించి మరోసారి కంచుకోటపై పారీ జెండాను ఎగరేసింది.

మండలం వైసీపి టీడీపీ మెజార్టీ ఆధిక్యం

పత్తికొండ 20,759 24,131 3,372 టీడీపీ

మద్దికెర 9,985 14,014 4,029 టీడీపీ

తుగ్గలి 19,484 21,594 2,110 టీడీపీ

క్రిష్ణగిరి 12,035 15,758 3,723 టీడీపీ

వెల్దుర్థి 21,686 22,121 542 టీడీపీ

పోస్టల్‌బ్యాలెట్‌ 689 1,231 542 టీడీపీ

మొత్తం 84,638 98,849 14,211 టీడీపీ

Updated Date - Jun 07 , 2024 | 12:25 AM