Share News

పెద్దారెడ్డి అనుచరుల వాహనాలు సీజ్‌

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:37 PM

తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుల వాహనాలను రవాణా శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు నరసింహారెడ్డికి చెందిన మూడు బస్సులు, నాగార్జున కనస్ట్రక్షన్స పేరిట ఉన్న రెండు టిప్పర్లను సీజ్‌ చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

పెద్దారెడ్డి అనుచరుల వాహనాలు సీజ్‌
ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేసిన వాహనం

తాడిపత్రి టౌన, జూన 11: తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుల వాహనాలను రవాణా శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు నరసింహారెడ్డికి చెందిన మూడు బస్సులు, నాగార్జున కనస్ట్రక్షన్స పేరిట ఉన్న రెండు టిప్పర్లను సీజ్‌ చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ వాహనాలను తాడిపత్రి మండలంలోని అర్జాస్‌ స్టీల్‌ పరిశ్రమకు ఒప్పందం ప్రాతిపదికన తిప్పుతున్నారు. పర్మిట్లు లేకపోవడంతో బస్సులను, ఫిట్‌నెస్‌, పర్మిట్లు లేకపోవడంతో టిప్పర్లను సీజ్‌ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆర్టీఏ అధికారులు వీటి గురించి పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Jun 11 , 2024 | 10:37 PM