Share News

భూసమస్యల పరిష్కారం నా వల్ల కాదు!

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:29 AM

భూసమస్యలను తాను పరిష్కరించలేనంటూ ప్రకాశం జిల్లా తర్లుపాడు తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌ రెవెన్యూ సదస్సు నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.

భూసమస్యల పరిష్కారం నా వల్ల కాదు!

రెవెన్యూ సదస్సు నుంచి వెళ్లిపోయిన తహసీల్దార్‌

తర్లుపాడు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): భూసమస్యలను తాను పరిష్కరించలేనంటూ ప్రకాశం జిల్లా తర్లుపాడు తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌ రెవెన్యూ సదస్సు నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఈ ఘటన కారుమానుపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. తర్లుపాడుకు చెందిన షేక్‌ పూలమహబూబీకి పదేళ్ల క్రితం 77/9 సర్వే నంబర్‌లో రెండెకరాలను అసైన్‌మెంట్‌ కమిటీ మంజూరు చేసింది. నాలుగేళ్ల క్రితం ఓ వైసీపీ నాయకుడు ఈ భూమిని పోలెబోయిన రమణమ్మ పేరుతో ఆన్‌లైన్‌ చేయించుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ మహబూబీ అర్జీ ఇచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటివి తాను పరిష్కరించలేనని తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ తేల్చి చెప్పారు. దీంతో న్యాయం చేయాలంటూ మహబూబీ నిరసనకు దిగడంతో.. మండలంలో ఇలాంటి సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించలేనని తహసీల్దార్‌ అన్నారు. రెవెన్యూ సభలోనే సెలవు చీటి రాసి నిష్క్రమించారు.

Updated Date - Dec 28 , 2024 | 04:29 AM