Share News

కడదాకా మంతనాలు!

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:08 AM

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జుల ప్రకటనపై కడదాకా వైసీపీ అధిష్ఠానం మంతనాలు సాగించింది.

కడదాకా మంతనాలు!

పలువురు ఎమ్మెల్యేలకు తాడేపల్లి పిలుపు

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జుల ప్రకటనపై కడదాకా వైసీపీ అధిష్ఠానం మంతనాలు సాగించింది. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కలిశారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని జగన్‌ ఆయన్ను ఆదేశించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కొన్ని షరతులు విధించారని సమాచారం. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను, కావలిలో ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డిని, ఉదయగిరిలో మేకపాటి రామ్‌గోపాల్‌రెడ్డిని మార్చాలని సూచించినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే అనిల్‌కుమార్‌, ప్రతా్‌పరెడ్డి పోటీ చేస్తారని జగన్‌ స్పష్టం చేశారు. ఉదయగిరికి రామ్‌గోపాల్‌ కంటే మంచి అభ్యర్థి ఉంటే తీసుకురావాలని వేమిరెడ్డికి సూచించారని తెలిసింది. ‘నెల్లూరు ఎంపీగా పోటీకి ఎందుకు భయపడుతున్నావ్‌? ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనా? కచ్చితంగా మనమే గెలుస్తాం. ధైర్యంగా పోటీ చేయి’ అనిస్పష్టం చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 03:08 AM