Share News

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:10 AM

చంద్రబాబు మాజీ పీఏ పి.శ్రీనివా్‌సపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ పై సస్పెన్షన్‌ ఎత్తివేత

తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు

అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు మాజీ పీఏ పి.శ్రీనివా్‌సపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ సీఎం అయ్యాక శ్రీనివా్‌సను టార్గెట్‌ చేశారు. చంద్రబాబును ఎలాగైనా ఇరికించాలన్న లక్ష్యంతో ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. తర్వాత శ్రీనివాస్‌ విదేశాలకు వెళ్లడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు తాజాగా శ్రీనివా్‌సపై మోపిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ, సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. సస్పెన్షన్‌ కాలాన్ని కూడా ఉద్యోగ కాలంగా పరిగణించి, తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Updated Date - Sep 10 , 2024 | 06:50 AM