Share News

తమిళనాడులో తెలుగును బతికించండి

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:17 AM

తమిళనాడులో తెలుగు భాషను బతికించడానికి కృషి చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో నివాసం ఉంటూ,

తమిళనాడులో తెలుగును బతికించండి

చంద్రబాబుకు తెలుగు యువశక్తి విజ్ఞప్తి

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో తెలుగు భాషను బతికించడానికి కృషి చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో నివాసం ఉంటూ, తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, ఇక్కడి తెలుగు వారికి తెలుగులో విద్య బోధించేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చినట్టు జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 06:17 AM