Share News

దురాత్ముల మాడుపగిలేలా సుప్రీం ఆదేశాలు: షర్మిల

ABN , Publish Date - May 19 , 2024 | 03:09 AM

దురాత్ముల నీచబుద్ధికి దిమ్మదిరిగేలా, మాడుపగిలేలా వివేకానందరెడ్డి హత్య విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది’

దురాత్ముల మాడుపగిలేలా సుప్రీం ఆదేశాలు: షర్మిల

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ‘దురాత్ముల నీచబుద్ధికి దిమ్మదిరిగేలా, మాడుపగిలేలా వివేకానందరెడ్డి హత్య విషయంలో సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శనివారం ఆమె ఎక్స్‌లో స్పందించారు. ‘భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయింది. అధికార బలాన్ని ఉపయోగించి, మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు. ఈ విజయం తొలి అడు గు మాత్రమే. రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం చేస్తాం’ అని షర్మిల అన్నారు.

Updated Date - May 19 , 2024 | 03:09 AM