Share News

కాలి నడకన తిరుమలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN , Publish Date - May 26 , 2024 | 01:47 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారిమెట్టు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం నడక ప్రారంభించిన ఆయన రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకున్నారు.

కాలి నడకన తిరుమలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి

తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారిమెట్టు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం నడక ప్రారంభించిన ఆయన రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. జస్టి్‌స రవికుమార్‌కు టీటీడీ రిసెప్షన్‌ అధికారులు స్వాగతం పలికారు. ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated Date - May 26 , 2024 | 08:12 AM