Share News

సుందరయ్య సేవలు మరువలేనివి

ABN , Publish Date - May 19 , 2024 | 11:56 PM

పుచ్చలపల్లి సుందరయ్య సేవలు మరువలేనివని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములు అన్నారు.

 సుందరయ్య సేవలు మరువలేనివి

తుగ్గలి, మే 19: పుచ్చలపల్లి సుందరయ్య సేవలు మరువలేనివని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన తుగ్గలిలో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకొని విద్యార్థి దశ నుంచే సేవాగుణం అలవర్చుకోవాలని, అప్పుడే దేశ ప్రగతికి ఉపయోగపడతారని అన్నారు. ప్రతి ఒక్కరూ సమస్యలపై పోరాటం చేయాలని, అవసరమైతే.. ఉద్యమబాట పట్టాలని, ఆ కాలంలోనే సుందరయ్య ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి జాతిని మేల్కొల్పారని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శిఖామణి, రంగస్వామి, రాముడు పాల్గొన్నారు.

సుందరయ్య స్ఫూర్తితోనే పోరాటాలు

దేవనకొండ : కమ్యూనిష్టులు పుచ్చలిపల్లి సుందరయ్య స్ఫూర్తితోనే పోరాటాలు చేయాలని సీపీఎం జిల్లా నాయకులు వీరశేకర్‌ అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళి ఆర్పించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై పోరాటాలు చేశారన్నారు. ప్రజాసంక్షేమమే తన ధ్యేమని, తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు అశోక్‌, రమేష్‌, బండ్లయ్య, బలరాముడు తదితరులు పాల్గొన్నారు.

ఆశయాల సాధన కోసం కృషిచేద్దాం

ఎమ్మిగనూరు: మహోన్నత వ్యక్తి సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల సాధనకు కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు అన్నారు. పట్టణంలోని స్థానిక సుందరయ్య భవన్‌లో జిల్లా నాయకులు గోవిందు అధ్యక్షతన సుందరయ్య 39వ వర్థంతిని నిర్వహించి ఘన నివాళి అర్పించారు.

Updated Date - May 19 , 2024 | 11:56 PM