Share News

జనానికి ‘వేసవి’ షాక్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 03:44 AM

వేసవి ప్రతాపాన్ని విద్యుత్‌ చార్జీల మోత రూపంలోనూ వినియోగదారుడే భరించాల్సిన పరిస్థితి నెలకొంది.

జనానికి ‘వేసవి’ షాక్‌

108 కోట్ల వసూలుకు సిద్ధమైన డిస్కమ్‌లు

ఏప్రిల్‌ 20-23మధ్య 151 మి.యూ. కొనుగోలు

డిమాండ్‌ మేరకు స్వల్ప వ్యవధి ప్రాతిపదికన...

ఆ ఖర్చు ఏప్రిల్‌ బిల్లులో కలిపి మేలో వసూలు

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): వేసవి ప్రతాపాన్ని విద్యుత్‌ చార్జీల మోత రూపంలోనూ వినియోగదారుడే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు, నాలుగు రోజుల్లో రూ.108.918 కోట్లతో 151.585 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. ఈ నెల 20న రూ.26.949 కోట్లతో 36.155 మిలియన్‌ యూనిట్లు, 21న రూ.23.396 కోట్లతో 36.954 మిలియన్‌ యూనిట్లు, 22న రూ.29.676 కోట్లతో 39.636 మిలియన్‌ యూనిట్లు, 23న రూ.28.892 కోట్లతో 38.894 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసింది. ఈ ఖర్చును వినియోగదారులనుంచే వసూలు చేసుకోవాలని డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఆదేశించింది. అంటే.. వేసవి విద్యుత్తు కొనుగోళ్ల భారమంతా వినియోగదారుల నుంచే డిస్కమ్‌లు వసూలు చేయనున్నాయి. ఏప్రిల్‌ విద్యుత్‌ బిల్లులను మే నెల మొదటివారంలోగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. స్వల్పవ్యవధి కింద బహిరంగ మార్కెట్లో యూనిట్‌ విద్యుత్తు పది రూపాయలకు లోబడే కొనాలని ఈఆర్‌సీ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్రంలో మంగళవారం 245.756 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఏర్పడింది. మార్కెట్లో 42.152 మిలియన్‌ యూనిట్లను డిస్కమ్‌లు కొనుగోలు చేశాయి. రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలలో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 08:19 AM