మనస్తాపంతో ఆత్మహత్య
ABN , Publish Date - May 26 , 2024 | 11:27 PM
మండల పరిధి ఉప్పలూరు గ్రామానికి చెందిన అరెడ్డిపల్లి ఓబులేసు(41)భార్య పై అనుమానంతో మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
ముద్దనూరు మే26: మండల పరిధి ఉప్పలూరు గ్రామానికి చెందిన అరెడ్డిపల్లి ఓబులేసు(41)భార్య పై అనుమానంతో మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఓబులేసు తన భార్య చెన్నకేశవమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. మనస్తాపం చెంది ఇంటిలో ఎవరూలేని సమయంలో రేకుల షెడ్డుకు ఉన్న ఇనుప పైపునకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరుడు పెద్దఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.