Share News

చర్యల నివేదికలు సమర్పించండి

ABN , Publish Date - May 30 , 2024 | 02:16 AM

సీఎ్‌సల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు.

చర్యల నివేదికలు సమర్పించండి

వివిధ శాఖలకు సీఎస్‌ ఆదేశం

సీఎ్‌సల భేటీలో చర్చించిన అంశాలపై సమీక్ష

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): సీఎ్‌సల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గతేడాది డిసెంబరు 27 నుంచి 29 వరకూ ఢిల్లీలో జరిగిన 3వ జాతీయ సీఎ్‌సల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి చర్చించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన సమీక్షించారు. రాష్ట్ర ప్రణాళికశాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంబంధిత శాఖల వారీగా తీసుకున్న, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. భూమి, ఆస్తులు, విద్యుత్‌, తాగునీరు, వైద్యారోగ్యం, విద్యాశాఖలకు సంబంధించి సీఎ్‌సల సమావేశంలో చర్చించిన ధీమ్‌ అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్‌కు సమర్పించాల్సి ఉందని, త్వరితగతిన సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. జూలైలో నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుందని ఆ సమావేశంలో గత సీఎస్‌ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారని పేర్కొన్నారు. తాగునీటి వనరులను జియో ట్యాగింగ్‌ చేసే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్షయ, టీబీ, బోధకాలు వ్యాధులను పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - May 30 , 2024 | 02:16 AM