Share News

జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:33 PM

జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం పోరాటాలు చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్‌ పిలుపునిచ్చారు.

   జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలు
మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం పోరాటాలు చేస్తుందని జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సుందరయ్య భవనని సీపీఎం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్‌, కార్యదర్శివర్గ సభ్యులు జి .రామక్రిష్ణ, పీఎ్‌స.రాధాక్రిష్ణ, ఎండి.అంజిబాబు, టి.రాముడులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ ఎమ్మిగనూరులో నిర్వహించిన సీపీఎం పార్టీ 23వ జిల్లా మహాసభల్లో 9 మంది కార్యవర్గ సభ్యులు, 26 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నామని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు నూతన కమిటీ కృషి చేస్తుందని అన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:33 PM