Share News

స్ట్రాంగ్‌ రూమ్‌ తనిఖీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:08 PM

ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను ఎన్నికల పోలీసు పరిశీలకులు (అబ్జార్వర్‌) ఉమేష్‌ కుమార్‌ శుక్రవారం తనిఖీ చేశారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ తనిఖీ

ఆదోని, ఏప్రిల్‌ 26: ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను ఎన్నికల పోలీసు పరిశీలకులు (అబ్జార్వర్‌) ఉమేష్‌ కుమార్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మతో నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, పోలీస్‌ భద్రత అంశాలపై చర్చించి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని, పొలింగ్‌ కేంద్రాలలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతం కలగకుండా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలని సంబంధిత పోలీసులు అధికారులకు ఎన్నికల పోలీస్‌ అబ్జార్వర్‌ ఉమేష్‌ కుమార్‌ సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శివ నారాయణ స్వామి, ట్రైనీ డీఎస్పీ ధీరజ్‌, మున్సిపాల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:08 PM