ఫైళ్లు మాయం చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:52 AM
ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్) కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఫైబర్‌నెట్ కార్యాలయంలో పోలీసుల తనిఖీలు
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్) కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఫైబర్‌నెట్ కార్యాలయంలో కీలక ఫైళ్లను మాయం చేస్తున్నారన్న సమాచారంతో విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ రతన్‌రాజు, సైబర్ క్రైం ఏసీపీ తేజేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి గురువారం ఉదయం విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని ఫైబర్‌నెట్ కార్యాలయానికి వచ్చారు. ఫైబర్‌నెట్ ఎండీ ఎం.మధుసూదనరెడ్డితోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్(ఫైనాన్స్) తదితర అధికారులతో చాలాసేపు మాట్లాడి ఫైళ్లన్నీ భద్రంగా ఉంచాలని చెప్పారు. గతంలో ఫైబర్‌నెట్‌లో స్కాం జరిగిందంటూ జగన్ సర్కారు పలువురు మాజీ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా అక్రమంగా చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.