Share News

ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకోండి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:10 AM

మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో సర్వే నెంబర్‌.151లో 16.38 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని గ్రామానికి చెందిన రామాంజనేయులు, మాజీ సర్పంచులు స్వామినాథన్‌, లక్ష్మప్ప, రామాంజనేయులు, లక్ష్మిరెడ్డి అన్నారు.

ప్రభుత్వ భూముల కబ్జాను అడ్డుకోండి

మంత్రాలయం, మార్చి 11: మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో సర్వే నెంబర్‌.151లో 16.38 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని గ్రామానికి చెందిన రామాంజనేయులు, మాజీ సర్పంచులు స్వామినాథన్‌, లక్ష్మప్ప, రామాంజనేయులు, లక్ష్మిరెడ్డి అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో డీటీ రాఘవేంద్రకు వినతి పత్రం అందజేశారు. కొంత మంది అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకులు 5.46 ఎకరాల భూమిని తమ పేర్ల మీదుగా నమోదు చేయించుకొని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి ప్రభుత్వ భూముల్లో చెక్‌డ్యాంల నిర్మాణం చేపడితే.. వాటిని పూడ్చి కబ్జా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలోని మూగజీవాలు, పశుగ్రాసం మేయడానికి ప్రభుత్వానికి అవసరమైన భూములు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో నాగరాజు, వీరన్న, నాగార్జున, వీరేష్‌, నర్సిరెడ్డి, అంజనేయ, రాఘవేంద్ర, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:10 AM