Share News

వజ్రాల కోసం పొలాల్లో తిరిగితే చర్యలు

ABN , Publish Date - May 30 , 2024 | 12:01 AM

వజ్రాల కోసం పొలాల్లో తిరుగుతుంటే చర్యలు తీసుకుంటామని జొన్నగిరి ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.

వజ్రాల కోసం పొలాల్లో తిరిగితే చర్యలు

తుగ్గలి, మే 29: వజ్రాల కోసం పొలాల్లో తిరుగుతుంటే చర్యలు తీసుకుంటామని జొన్నగిరి ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. బుధవారం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వజ్రాల అన్వేషకులను పొలాల్లో తిరగరాదని, వెనక్కు వెళ్లాలని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ ఉండటం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గుంపులు గుంపులుగా వచ్చి రాత్రివేళలో ఎక్కడ పడితే.. అక్కడ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పొలాలు గట్టి పడి విత్తనాల విత్తేందుకు అనుకూలంగా లేకపోవడంతో అధిక భారం పడుతోందని రైతులు హెచ్చరికబోర్డులు పెట్టినా అన్వేషకులు పట్టించుకోవడం లేదని అన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:01 AM