Share News

రేషన్‌ డీలర్ల రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:26 AM

రేషన్‌ డీలర్స్‌ సమాఖ్య రాష్ట్ర నూతన కార్యాలయాన్ని సోమవారం విజయవాడలో ప్రారంభించారు.

రేషన్‌ డీలర్ల రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌ డీలర్స్‌ సమాఖ్య రాష్ట్ర నూతన కార్యాలయాన్ని సోమవారం విజయవాడలో ప్రారంభించారు. స్థానిక మొగల్‌రాజ్‌పురం రెవెన్యూ కాలనీలోని సత్యా అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ నూతన కార్యాలయాన్ని ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ ప్రారంభించారు. రేషన్‌ డీలర్స్‌ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు, ఆ సమాఖ్య ముఖ్యనేత ఫణికుమార్‌, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన డీలర్‌ సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 09:36 AM