Share News

నేటి నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి కౌంటర్‌ పునఃప్రారంభం

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:19 AM

విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్టు డొనేషన్‌ కౌంటర్‌ తిరుపతి ఎయిర్‌పోర్టులో బుధవారం నుంచి పునఃప్రారంభం కానుంది.

నేటి నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి కౌంటర్‌ పునఃప్రారంభం

తిరుమల, మార్చి 12(ఆంధ్రజ్యోతి): విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్టు డొనేషన్‌ కౌంటర్‌ తిరుపతి ఎయిర్‌పోర్టులో బుధవారం నుంచి పునఃప్రారంభం కానుంది. దేశవిదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వారి కోసం గతంలో తిరుపతి విమానాశ్రయంలో రోజూ వంద శ్రీవాణి టికెట్లను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో టీటీడీ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతిలేని కారణంగా గతేడాది డిసెంబరు 16వ తేదీ నుంచి కౌంటర్‌ను తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనానికి మార్చారు. బోర్డింగ్‌ పాస్‌ సమర్పించిన వారికి ఈ టికెట్లను కేటాయిస్తూ వచ్చారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నుంచి అనుమతులు లభించిన నేపథ్యంలో తిరిగి బుధవారం నుంచి తిరుపతి విమానాశ్రయంలోనే టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

Updated Date - Mar 13 , 2024 | 03:19 AM