Share News

నగ్నంగా తిప్పుతూ.. బూటు కాళ్లతో తంతూ..

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:53 AM

వైసీపీ పాలనలో కొందరు పోలీసులు ఆ పార్టీ నేతలకంటే దారుణంగా తయారయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఘటనే తాజా ఘటనే ఇందుకు నిదర్శనం!.

నగ్నంగా తిప్పుతూ.. బూటు కాళ్లతో తంతూ..

వైసీపీ జెండా దించాలన్నందుకు పాల్తూరు పోలీసుల దాష్టీకం

వైసీపీ నేతల తప్పుడు ఫిర్యాదుతో కేసు.. టీడీపీ కార్యకర్తపై జులుం

పక్కటెముక విరిగినా జైలుకు పంపిన వైనం

సోషల్‌ మీడియాలో వైరల్‌.. ఆలస్యంగా వెలుగులోకి..

విడపనకల్లు, జనవరి 7: వైసీపీ పాలనలో కొందరు పోలీసులు ఆ పార్టీ నేతలకంటే దారుణంగా తయారయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నా యి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఘటనే తాజా ఘటనే ఇందుకు నిదర్శనం!. మండలంలోని పాల్తూరు స్టేషన్‌ పోలీసులు చీకలగురికి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్‌ను దుస్తులు ఊడదీయించి, బూటుకాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ.. స్టేషన్‌ ఆవరణలో నగ్నంగా తిప్పారు. వైసీపీ జెండాను తొలగించి దాని స్థానంలో జాతీయ జెం డా ఎగురవేయాలని కోరాడనే.. అతడిపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు చంద్రమోహన్‌ పక్కటెముక విరిగినప్పటికీ.. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యం గా వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా.. డిసెంబరు 31వ తేదీ రాత్రి చీకలగురికి గ్రామ సచివాలయం ముందున్న వైసీపీ జెండాను తొలగించి, జాతీయ జెండా ఎగురవేయాలని టీడీపీ కార్యకర్త చంద్రమోహన్‌ వైసీపీ కార్యకర్తలను కోరాడు. వారు ఒప్పుకోకపోవడంతో.. వైసీపీ జెండాను కిందకు దించకపోతే, తానే తొలగించి తగలబెట్టేస్తానని చంద్రమోహన్‌ అన్నాడు.

దీంతో వారు చంద్రమోహన్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం, తమ పార్టీ జెండాను తొలగించి తగలబెట్టాడని వైసీపీ కార్యకర్తలు పాల్తూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వారు జనవరి 1న చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు స్టేషన్‌కు తీసుకెళ్తున్నారంటూ అతడు ప్రశ్నించడంతో.. తమకే ఎదు రు మాట్లాడతావా అంటూ పోలీసులు.. చంద్రమోహన్‌ దుస్తులు ఊడ దీ యించి, బూటు కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అంతటితో ఆగకుండా స్టేషన్‌ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతూ చితకబాదారు. అరెస్టు చూపి జైలుకు తరలించగా, 4వ తేదీన ఉరవకొండ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ర్టే ట్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అయితే, పోలీసు దెబ్బలకు ఒళ్లంతా హూన మై.. ఆరోగ్యం క్షీణించడంతో అతడిని అదేరోజు కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆస్పత్రిలో చేర్చారు. కాగా, పాల్తూరు పోలీసులు.. చంద్రమోహన్‌ను స్టేషన్‌ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతుండగా కొందరు వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. తాము చంద్రమోహన్‌ ను కొట్టలేదనీ, కేసు నమోదు చేసి జైలుకు పంపామని వివరణ ఇచ్చారు.

Updated Date - Jan 08 , 2024 | 05:53 AM