Share News

భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్‌

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:48 PM

1800 మెగావాట్ల వీరబల్లి ఆప్‌- స్ర్టీమ్‌ క్లోజ్డ్‌ లూబ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్ట ర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

భూసేకరణ వేగవంతం చేయండి : కలెక్టర్‌

రాయచోటి(కలెక్టరేట్‌), జనవరి 6: 1800 మెగావాట్ల వీరబల్లి ఆప్‌- స్ర్టీమ్‌ క్లోజ్డ్‌ లూబ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్ట ర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు అంశం పై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏర్పా టుకు వీరబల్లి మండలంలో 616.56 ఎకరాలు, రామాపురం మండలంలో 59.35 సెంట్లు అవసరం అవుతాయని ప్రతిపాదిత ప్రాజెక్టు అధికారులు గుర్తించారన్నా రు. ప్రాజెక్టు భూముల నిమిత్తం ఇప్పటికే ఫారం ఏ-2, ఫారం-సీలలో అనుమతు లు మంజూరైనట్లు తెలిపారు. ప్రాజెక్టు నిమిత్తం సేకరిస్తున్న భూముల్లో ప్రభుత్వ, డీకేటీ, పట్టా ల్యాండ్‌లలో నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. ఈ సమావేశంలో రాజంపేట, రాయచోటి ఆర్డీవోలు రామక్రిష్ణారెడ్డి, రంగస్వామి, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి ప్రసన్నకుమార్‌, ఆర్‌అండ్‌బీ డీఈ సహదేవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు, ఫారెస్టు అధికారులు, సంబంధిత తహసీల్దార్లు తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:48 PM