Share News

ఓదార్పు రివర్స్‌!

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:57 AM

ఓదార్పు యాత్రలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గురువారం తన పార్టీ ప్రస్తుత, మాజీ ఎంపీలు,

ఓదార్పు రివర్స్‌!

జగన్‌కు వైసీపీ నేతల అనునయింపు

ఓదార్పు యాత్రలు చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని గురువారం తన పార్టీ ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రివర్స్‌లో ఓదార్చారు. తాడేపల్లి నివాసంలో ఆయన వారందరితో సమావేశమయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఈ స్థాయి ఓటమిని ఊహించలేదని, ఓట్లన్నీ ఏమయ్యాయో తెలియడం లేదని.. ఇంత ఘోర పరాజయానికి కారణాలు తెలియడం లేదని జగన్‌ వాపోయా రు. ఓటమిపై ఆలోచించొద్దని వైసీపీ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాగా.. ఘోర పరాజయం నేపథ్యంలో తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని త్వరలోనే ప్యాలె్‌సలోకి మార్చేయాలని నిర్ణయించారు.

Updated Date - Jun 07 , 2024 | 08:00 AM