స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:58 AM
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలోను కొత్త సంస్కరణలు ప్రారంభమయ్యా యి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ వినియోగదారు లకు సంబంధించి స్మార్ట్ మీటర్లు (డిజిటల్ మీటర్లు) ఏర్పాటు ప్రారంభమైంది.
విద్యుత్ సంస్థలో కొత్త సంస్కరణలు
ఉమ్మడి పశ్చిమలో విద్యుత్
కనెక్షన్లు 16.26 లక్షలు
ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పూర్తి
ప్రస్తుతం వాణిజ్య సంస్థలకు ఏర్పాటు
బిల్లులు పెరుగుతాయని వినియోగదారుల ఆందోళన
అవి అపోహలే : విద్యుత్ శాఖ
రాబోయే రోజుల్లో ప్రీపెయిడ్ ప్లాన్ అమలయ్యే అవకాశం
ఏలూరు సిటీ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యుత్ సంస్థలోను కొత్త సంస్కరణలు ప్రారంభమయ్యా యి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్ వినియోగదారు లకు సంబంధించి స్మార్ట్ మీటర్లు (డిజిటల్ మీటర్లు) ఏర్పాటు ప్రారంభమైంది. వీటి ఏర్పాటును ఒక కార్పొరేట్ సంస్థకు అప్పగిం చారు. వీటివల్ల నెలవారీ బిల్లింగ్ పెరుగుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతుండగా, ఇవి కేవలం అపోహలు మాత్రమేనని విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి, విద్యుత్ విని యోగం సక్రమంగా జరగడం కోసమే ఏర్పాటు చేస్తున్నట్టు విద్యుత్ శాఖ చెబుతోంది.
ఉమ్మడి పశ్చిమలో 16 లక్షల 26వేల 973 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ఇం దులో తొలిదశలో ఆగస్టు నుంచి ప్రభుత్వ కార్యా లయాలకు సంబంధించి 31,594 స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రారంభించి పూర్తి చేశారు. ప్రస్తుతం కేటగిరి–2కు సంబంధించి వాణిజ్య వినియోగ దారులైన 1,59,356 మందికి చెందిన వ్యాపార సంస్థలకు సెప్టెంబరు 25 నుంచి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్త యిన రాబోయే రోజుల్లో 13 లక్షల 607 మంది గృహ విద్యుత్ వినియోగదారుల ఇళ్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తారని ఏపీఈపీడీసీఎల్ ఉన్నతాఽధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసినా విద్యుత్ బిల్లింగ్ గతంలో తీస్తున్నట్లుగానే మీటరు రీడర్లు ఈ స్మార్ట్ మీటర్లు నుంచి విద్యుత్ బిల్లులు తీస్తారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో బిల్లులు రెట్టింపవుతా యన్న ఆందోళన సామాన్య, మధ్యతరగతి విద్యుత్ వినియోగదారుల్లో కనిపిస్తోంది. అందుకే వీటి ఏర్పాటును వినియోగదారులు వ్యతిరేకిం చారు. అయితే స్మార్ట్ మీటర్లతో బిల్లులు పెరగ వని ఇది కేవలం అపోహ మాత్రమేనని, గతంతో మాదిరిగానే విద్యుత్ బిల్లులు వస్తాయని విద్యుత్ శాఖ చెబుతోంది. మారుతున్న కాలానికి అను గుణంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు జరుగుతోం దని వారు చెబుతున్నారు.
భవిష్యత్‌లో ప్రీపెయిడ్ విధానం..!
ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లింపునకు సంబంధించి వినియోగదారుడు చెల్లించే విద్యుత్ బిల్లు మీదే క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. దానిని స్కాన్ చేసి వినియోగదారులు బిల్లు చెల్లించవచ్చు. రాబోయే రోజుల్లో విద్యుత్ విని యోగానికి కూడా సెల్‌ఫోన్ రీచార్జి మాదిరి గానే రీచార్జి చేసుకునే పరిస్థితి రాబోతోంది. ఇంకా మార్గదర్శకాలు విడుదల కాకపోయినా వినియోగ దారులే సెల్ ఫోన్ రీచార్జి మాదిరి గా ఎంత విద్యుత్ వినియోగం ఉంటే ప్రీపెయి డ్ విధానంలో అంత విద్యుత్‌ను రీచార్జి చేసు కుని వినియోగించుకోవడానికి అవకాశం ఏర్ప డుతుంది.
విద్యుత్ పొదుపు లక్ష్యం
ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్‌లో పొదుపు సాధించవచ్చని, తద్వారా నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేయ డానికి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాద నలు రాగా వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడంతో కొంత జాప్యం జరిగింది.
ఉమ్మడి పశ్చిమలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు
ఇప్పటికే ఉమ్మడి పశ్చిమలోని ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పూర్త యింది. ఇప్పుడు వాణిజ్య వినియోగదారులకు (వ్యాపార సంస్థలకు) స్మార్ట్ మీటర్ల ఏర్పాటు జరుగుతోంది. రాబోయే రోజుల్లో గృహ విద్యుత్ కనెక్షన్లకూ ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లుల పెరుగుదల ఉండదు. కేవలం అపోహ మాత్రమే. విద్యుత్ పొదుపు సాధ్యమవుతుంది.
పి.సాల్మన్‌రాజు, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ , ఏలూరు సర్కిల్