Share News

ఎస్కేయూలో చంద్రబాబు చిత్రపటం ఏర్పాటు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:13 AM

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించడంతో నూతన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ఎస్కేయూ వీసీ చాంబర్‌లో టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు చంద్రబాబునాయుడి చిత్రపటాన్ని ఏర్పాటుచేశారు.

ఎస్కేయూలో చంద్రబాబు చిత్రపటం ఏర్పాటు
చంద్రబాబు చిత్రపటం ఏర్పాటు అనంతరం టీఎనఎస్‌ఎఫ్‌ నాయకుల నినాదాలు

అనంతపురం సెంట్రల్‌, జూన 6: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించడంతో నూతన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ఎస్కేయూ వీసీ చాంబర్‌లో టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు చంద్రబాబునాయుడి చిత్రపటాన్ని ఏర్పాటుచేశారు. ఇక నుంచి ఉద్యోగులను, సిబ్బందిని వేధించడం, అరాచకాలకు పాల్పడటం వంటి చర్యలకు తావులేకుండా పాలన సాగుతుందని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా వర్సిటీ పాలన ఉండబోతోందని సీఎంగా చంద్రబాబునాయుడు మళ్లీరావడం అన్ని వర్గాలకు శుభపరిణామమని పేర్కొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:13 AM